కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద (Nagalgidda) మండలంలో రోడ్లు, తాగునీటి సమస్యల పరిష్కారం కోసం నారాయణ ఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి (Mahareddy Bhupal Reddy) పాదయాత్ర నిర్వహించారు. కారముంగి గ్రామం నుంచి కర్రస్ గుత్తి గ్రామం వరకు బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి పాదయాత్ర (BRS Padyatra) చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. గ్రామాల్లో నెలకొన్న అధ్వాన్న రహదారులు, తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

