కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామంలో అవినీతి నిరోధక శాఖ (ACB Trap) అధికారులు …ఇంటి మ్యుటేషన్ ప్రక్రియ కోసం 15,000 లంచం డిమాండ్ చేసిన గ్రామ పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
జక్కాపూర్ గ్రామానికి చెందిన కయ్యాల కిషన్ తన ఇంటి మ్యుటేషన్ కోసం గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్ ని సంప్రదించారు. అయితే, ఆ పని పూర్తి చేయడానికి పంచాయతీ కార్యదర్శి రూ.15,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితుడు లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు, మంగళవారం బాధితుడి వద్ద నుంచి పంచాయతీ కార్యదర్శి రూ. 15,000 లంచం డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు.

