ఖమ్మంలో ఎఫ్‌ఎంజీ వైద్యుల ఆందోళన

​కలం, ఖమ్మం బ్యూరో: ​దేశీయ వైద్య విద్యార్థులతో సమానంగా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆసుపత్రులలో విధులను నిర్వర్తిస్తున్నప్పటికీ, వేతనాల విషయంలో మాత్రం తీవ్రమైన వివక్ష చూపుతున్నారంటూ విదేశీ వైద్య పట్టభద్రులు (FMGs) మండిపడుతున్నారు. స్థానిక ఇంటర్న్‌ వైద్యులకు ఒకన్యాయం, తమకు మరోన్యాయం చేస్తున్నారంటూ మంగళవారం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఎఫ్‌ఎంజీ వైద్యులు ఆందోళన (FMG Doctors Protest) చేపట్టారు.

​సాధారణ వైద్య విద్యార్థులకు నెలకు రూ. 29,792 వరకు స్టైపెండ్ అందిస్తుండగా, అదే విధులను నిర్వర్తిస్తున్న విదేశీ వైద్య పట్టభద్రులకు మాత్రం కేవలం రూ. 5,000 మాత్రమే చెల్లించడం దారుణమని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అసమానతలపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, సంబంధిత అధికారులు మాత్రం వాటిని బేఖాతరు చేస్తూ అమలు చేయడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

​గత పది నెలలుగా స్టైపెండ్ సరిగ్గా అందక, మరోవైపు వేతనాల్లో చూపుతున్న ఈ భారీ తేడాతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఈ సమస్యపై తక్షణమే స్పందించి సమాన స్టైపెండ్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే త్వరలోనే హైదరాబాద్‌లోని డీఎంఈ (DME) కార్యాలయం ముట్టడితో పాటు ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>