కలం, వెబ్‌డెస్క్: 1971 జనాభా లెక్కల ప్రకారమే కేంద్రం డీలిమిటేషన్ (Delimitation) ప్రక్రియ చేపడుతుందని సీఎం చంద్రబాబు (Chandrababu) తెలిపారు. కేంద్రం రెండు బిల్లులకు ఆమోదం తెలిపిన సందర్భంగా సీఎం చంద్రబాబు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్‌లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. కాంగ్రెస్ కోరుతున్నట్లు డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. విపక్షాలు ఎందుకు ఇంకా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. 30 ఏళ్లుగా మహిళలకు రిజర్వేషన్లు కల్పించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ , దేవేగౌడ, వాజ్‌పేయి కాలంలో కూడా మహిళా బిల్లు ప్రవేశపెట్టి నిరాశ చెందామని గుర్తు చేసుకున్నారు. ఇటీవల ఏప్రిల్‌లో ప్రధాని మోదీ కూడా మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు.
మహిళల హక్కుల కోసం అన్ని రాష్ట్రాలు సపోర్ట్ చేయాలని సీఎం చంద్రబాబు (Chandrababu) కోరారు. మహిళా బిల్లుపై పార్టీలన్నీ ఏకాభిప్రాయానికి రావాలని పిలుపునిచ్చారు. ఇలాంటి సందర్భంలో రాంగ్ సైడ్ ఉండొద్దని స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీలంతా డీలిమిటేషన్, మహిళా బిల్లుకు మద్దతు తెలుపుతారని స్పష్టం చేశారు.
Also Read : స్విట్జర్లాండ్ చర్చిలో అన్నమయ్య సంకీర్తనలు!
Follow Us On: X(Twitter)

