కలం, బాసర: డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ భద్రతా నిపుణుడు, సీఐ వెంకట రమణ అన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలోని (Basara IIIT) ఎస్ఏసీ ఆడిటోరియంలో శుక్రవారం సైబర్ నేరాలు, భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్లు, ఆన్లైన్ గేమ్స్ యువత జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయన్నారు.
వాటికి దూరంగా ఉండాలని సూచించారు. అపరిచిత లింకులు క్లిక్ చేయవద్దని, ఓటీపీ, బ్యాంకు వివరాలు ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. క్యాంపస్ (Basara IIIT) చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ డీఎస్పీ వెంకట రామయ్య మాట్లాడుతూ.. సైబర్ మోసాలకు గురైతే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. వీసీ ప్రొఫెసర్ ఏ. గోవర్ధన్ మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

