కరెంటు కోతలు ఆపాలి.. ట్రూ-అప్ చార్జీల భారం తగ్గించాలి: సీపీఎం

కలం, యాదగిరిగుట్ట: విద్యుత్ కోతలతో రైతాంగం, పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే విద్యుత్ కోతలను నివారించి రైతులను ఆదుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి గడ్డం వెంకటేష్ (Gaddam Venkatesh) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆరుగాలం (ఏడాది పొడుగునా) కష్టపడి సాగు చేసిన పంటలకు సకాలంలో నీరందక, ఎండల తీవ్రతతో పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా అందించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

మరోవైపు విద్యుత్ ట్రూ-అప్ చార్జీల పేరుతో సామాన్య వినియోగదారులపై అదనపు భారం పడటం ఆందోళనకరమన్నారు. ఇప్పటికే ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలపై విద్యుత్ చార్జీల భారం మోపడం సరికాదన్నారు. విద్యుత్ కోతలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తూ, రైతాంగానికి న్యాయం చేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా విద్యుత్ సరఫరాను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దకందుకూరు మాజీ సర్పంచ్ బీమగాని రాములు, పట్టణ నాయకుడు సీస శ్రీనివాస్, మండల నాయకులు కాలే స్వామి, బబ్బూరి శ్రీనివాస్, వడ్లకొండ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>