కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట (Siddipet) జిల్లా నంగునూరు మండలం కొండరాజుపల్లిలోని ఏనుగురాళ్ల సమీపంలో అనుమానాస్పద స్థితిలో 5 నెమళ్లు (Peacocks) మృతి చెందాయి. ఈ విషయాన్ని స్థానికుల సమాచారం ద్వారా తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
నెమళ్ల కళేబరాలకు పంచనామా నిర్వహించి పూడ్చిపెట్టారు. అయితే నెమళ్లపై విష ప్రయోగం జరిగిందా..? లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

