Mobile Popup Ad
Mobile Popup Ad

పశ్చిమ బెంగాల్‌‌లో కాలిపోయిన 4 వేల ఈవీఎంలు

కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌‌లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. కోల్‌కతా (Kolkata) అలీపుర్‌లోని 9 అంతస్తుల ప్రభుత్వ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 4 వేల ఈవీఎంలు కాలిపోయాయి. ఇటీవల జరిగిన 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు వీటినే వాడటం గమనార్హం. ఎన్నికల నిబంధనల ప్రకారం, వీటిని కట్టుదిట్టమైన భద్రత నడుమ భద్రపరిచారు. అలాంటి చోట అగ్ని ప్రమాదం జరిగి భారీ సంఖ్యలో ఈవీఎంలు దగ్ధం కావడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదే అంతస్తులో దక్షిణ 24 పరగణాల జిల్లా పరిషత్తు కార్యాలయం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై మంత్రి కౌశిక్ స్పందిస్తూ.. కేవలం 9వ అంతస్తులోనే మంటలు రావడంపై తమకు అనుమానాలున్నాయని వివరించారు. ఫోరెన్సిక్ నిపుణులు పరీక్ష చేస్తున్నారని, రిపోర్ట్ వచ్చాకే క్లారిటీ వస్తుందని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>