Mobile Popup Ad
Mobile Popup Ad

7 నెలలకే కోచ్‌కు ఉద్వాసన.. వుల్వ్స్ సంచలన నిర్ణయం

క‌లం, వెబ్ డెస్క్: ప్రీమియర్ లీగ్ నుంచి జట్టు దిగజారిన వెంటనే వుల్వర్‌హాంప్టన్ వాండరర్స్ (Wolverhampton Wanderers) సంచలన నిర్ణయం తీసుకుంది. కేవలం ఏడు నెలల క్రితమే భారీ అంచనాల మధ్య ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన రాబ్ ఎడ్వర్డ్స్‌ (Rob Edwards)కు క్లబ్ ఉద్వాసన పలికింది. ఆయనతో పాటు కోచింగ్ సిబ్బందినీ తొలగిస్తూ వుల్వ్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. గత నవంబర్‌లో విటోర్ పెరీరా స్థానంలో మూడున్నరేళ్ల ఒప్పందంతో రాబ్ ఎడ్వర్డ్స్‌ను క్లబ్ నియమించింది. అయితే జట్టు పరిస్థితిని మార్చడంలో ఆయన విఫలమయ్యారు. ఎనిమిదేళ్లుగా ప్రీమియర్ లీగ్‌లో కొనసాగుతున్న వుల్వ్స్ ఈ సీజన్‌లో అట్టడుగున నిలిచి ఛాంపియన్‌షిప్‌కు దిగజారింది.

భద్రతా స్థానానికి 21 పాయింట్ల దూరంలో ముగించిన జట్టు, ఎడ్వర్డ్స్ నాయకత్వంలో 30 మ్యాచ్‌ల్లో కేవలం ఐదు విజయాలే సాధించింది. సీజన్ ముగిసిన తర్వాత క్లబ్ కార్యకలాపాలపై సమగ్ర సమీక్ష నిర్వహించినట్లు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నాథన్ షీ తెలిపారు. జట్టు భవిష్యత్తు, ఆటతీరు, పోటీతత్వాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త దిశలో వెళ్లాల్సిన అవసరం ఉందని భావించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం ఎడ్వర్డ్స్ వ్యక్తిత్వం లేదా కృషిపై కాదని, పూర్తిగా క్రీడాపరమైన కారణాలతోనే తీసుకున్నదని వివరించారు.

అదే సమయంలో రాబ్ ఎడ్వర్డ్స్, ఆయన సిబ్బంది చేసిన సేవలకు క్లబ్ కృతజ్ఞతలు తెలిపింది. కొత్త ప్రధాన కోచ్ ఎంపిక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, జట్టును తిరిగి విజయాల బాట పట్టించగల నాయకుడి కోసం అన్వేషణ కొనసాగుతోందని వెల్లడించింది. దీంతో వుల్వ్స్ తదుపరి కోచ్ ఎవరు అనే అంశంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>