నారాయణపేట మెడికల్ కాలేజీ గర్ల్స్ హాస్టల్‌లో భారీ అగ్నిప్రమాదం!

కలం, వెబ్ డెస్క్: నారాయణపేట మెడికల్ కాలేజీ (Narayanpet Medical College) కి చెందిన బాలికల హాస్టల్‌లో సోమవారం ఒక్కసారిగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్య్కూట్ కారణంగా మంటలు చెలరేగి హాస్టల్ గదుల్లోకి వ్యాపించడంతో విద్యార్థినులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో విద్యార్థినులకు చెందిన బట్టలు, పుస్తకాలు, ఇతర వ్యక్తిగత వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటల కారణంగా హస్టల్ అంతటా దట్టమైన పొగ అలుముకోవడంతో కొందరు విద్యార్థినులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే అదృష్టవశాత్తూ విద్యార్థినులందరూ సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.

కాగా, ప్రైవేట్ భవనాన్ని అద్దెకు తీసుకుని కాలేజీ యాజమాన్యం హాస్టల్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. హాస్టల్ లో కనీస అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు కూడా లేవని, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని విద్యార్థినులు చెబుతున్నారు. ఈ ఘటనతో హాస్టల్ భద్రతా ప్రమాణాలు, మౌలిక సదుపాయాల కల్పనపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన కాలేజీ (Narayanpet Medical College) యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందా? నిబంధనలకు అనుగుణంగా హాస్టల్ నిర్వహిస్తున్నారా? అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్​యులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

Also Read : జమ్మూ కశ్మీర్‌లో మరోసారి కాల్పులు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>