డంపింగ్ యార్డులో అగ్నిప్రమాదం.. రంగంలోకి ఫైర్ సిబ్బంది!

కలం, ఖమ్మం బ్యూరో: ​ఖమ్మం నగరంలోని డంపింగ్ యార్డులో అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. చెత్తకుప్పలకు నిప్పంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ​సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

మంటలు మరింతగా వ్యాపించకుండా అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ​మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు బయో మైనింగ్ పనులు కొనసాగుతున్న వేళ ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టి, ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.

Also Read : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి తాజా రేట్లు ఇవే!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>