గాడిదలకు పెళ్లి చేశారు.. ఎందుకంటే?

క‌లం, వెబ్‌డెస్క్‌: అనంతపురం (Anantapur) జిల్లా కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లిలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ గ్రామస్తులు గాడిదలకు వివాహం (Donkey Wedding) జరిపించారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ప్రస్తుతం ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి స్థానికులు ఈ వింత ఆచారాన్ని ఎంచుకున్నారు. సాంప్రదాయబద్ధంగా జరిగిన ఈ పెళ్లి వేడుక ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

గతంలో కూడా ఇలాగే గాడిదలకు పెళ్లి చేయడం వల్ల వర్షాలు కురిశాయని, ఈసారి కూడా వరుణుడు కరుణించి తమ ప్రాంతంలో వ‌ర్షం కురిసేలా చేస్తాడని గ్రామస్తులు బలంగా నమ్ముతున్నారు. ఒక‌వైపు క‌ప్ప‌ల‌కు పెళ్లిళ్లు, దేవుళ్ల విగ్ర‌హాల‌కు జ‌లాభిషేకాలు.. ఇప్పుడు గాడిద‌ల‌కు పెళ్లి.. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో వింత న‌మ్మ‌కాలు, ఆచారాల‌తో ప్ర‌జ‌లు వ‌ర్షాల కోసం ప్రార్థ‌న‌లు చేస్తున్నారు.

Read Also: నిర్మల్ జిల్లాలో ‘కారు’ స్టీరింగ్ పట్టేది ఎవరు?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>