జవహర్‌నగర్ క్వారీ గుంతలో విషాదం.. ఇద్దరు దుర్మరణం!

కలం, వెబ్ డెస్క్ : స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు వెళ్లి ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ (Jawaharnagar Tragedy) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. యాప్రాల్‌ ప్రాంతానికి చెందిన ఐదుగురు విద్యార్థులు జవహర్‌నగర్ పరిధిలోని మల్కారం క్వారీ గుట్టల వద్దకు వెళ్లారు. అక్కడ భోజనాలు ముగించిన అనంతరం ఈత కొట్టేందుకు, నీటి గుంత వద్దకు వెళ్లిన క్రమంలో ఇద్దరు విద్యార్థులు క్వారీ లోతు తెలియక నీటిలో మునిగిపోయారు. మృతి చెందిన విద్యార్థులను సీవీఆర్ కాలేజీలో చదువుతున్న రోహిత్ (18), సీఎంఆర్ కాలేజీకి చెందిన సయాన్ (18)గా గుర్తించారు.

తోటి స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో వెంటనే జవహర్‌నగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, హైడ్రా , డీఆర్ఎఫ్ సహాయక బృందాల రెస్క్యూ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. సరదాగా వెళ్లిన తమ పిల్లలు అనంత లోకాలకు వెళ్లడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>