Mobile Popup Ad
Mobile Popup Ad

ఎఫ్1 హైబ్రిడ్ టెక్నాలజీ అసలు రేసింగే కాదు: ఫెర్నాండో

కలం, స్పోర్ట్స్‌ : ఫార్ములా-1 రేసింగ్ ప్రపంచంలో సరికొత్త హైబ్రిడ్ టెక్నాలజీ తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ హైబ్రిడ్ టెక్నాలజీ నియామాలపై రేసింగ్ డ్రైవర్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా దీనిపై స్పందించిన దిగ్గజ రేసర్ ఫెర్నాండో అలోన్సో (Fernando Alonso).. అసలు ఈ టెక్నాలజీ ఉన్నది రేసింగే కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వీకెండ్‌లో జరగబోయే కెనడియన్ గ్రాండ్ ప్రిక్స్‌కు ముందు, రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ప్రముఖ రేసర్ ఫెర్నాండో అలోన్సో చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. ప్రస్తుత ఎఫ్‌1 హైబ్రిడ్ విధానం అసలైన రేసింగ్ మజాను పూర్తిగా దెబ్బతీసిందని, నిర్వాహకులు ఈ పేరుతో గత దశాబ్ద కాలపు ‘ప్యూర్ రేసింగ్’ను వృధా చేశారని ఆయన గురువారం మండిపడ్డారు.

ఈ ఏడాది ఫార్ములా వన్ కార్లలో ప్రవేశపెట్టిన నిబంధనల ప్రకారం.. ఇంజన్ పవర్, ఎలక్ట్రిక్ పవర్‌ను 50-50 నిష్పత్తిలో ఉపయోగిస్తున్నారు. ఈ మార్పుల వల్ల ట్రాక్‌పై డ్రైవర్లు స్వేచ్ఛగా దూసుకెళ్లలేకపోతున్నారని అలోన్సో (Fernando Alonso) ఆరోపించారు. కార్లలోని ఎనర్జీ, పవర్ లోడ్స్‌ను మేనేజ్ చేయడం కోసమే డ్రైవర్లు ఎక్కువ కష్టపడాల్సి వస్తోందని, దీనివల్ల మలుపుల (టర్నింగ్స్) వద్ద కార్లను కావాలనే నెమ్మదిగా నడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.

నిజానికి 2014లో ఎఫ్‌1 నిర్వాహకులు ఎలక్ట్రిక్ వాహనాలే భవిష్యత్తు అనే ఆలోచనతో హైబ్రిడ్ టెక్నాలజీ వైపు అడుగులు వేశారని, కానీ అది రేసింగ్ రంగానికి అస్సలు సెట్ కాదని ఆయన స్పష్టం చేశారు. రేసింగ్ అనేది పూర్తిగా భిన్నమైనదని.. దురదృష్టవశాత్తూ ఈ టర్బో కాలం వల్ల గత పదేళ్లుగా మనం అసలైన రేసింగ్ అనుభవాన్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కారులో ఎనర్జీని కాపాడుకోవడం కోసం వేగాన్ని తగ్గించుకోవాల్సి వస్తోందని, దీనివల్ల ఈ సీజన్‌లో జరుగుతున్న ఓవర్‌టేకింగ్‌లు, రేసింగ్‌లు అన్నీ చాలా కృత్రిమంగా (ఆర్టిఫిషియల్‌గా) మారిపోయాయని విమర్శించారు. ఈ కొత్త విధానంపై ఇప్పటికే రెడ్ బుల్ రేసర్ మాక్స్ వెర్‌స్టాపెన్‌తో పాటు పలువురు డ్రైవర్లు కూడా అసంతృప్తితో ఉన్నారు.

Read Also: కేంద్ర మంత్రివర్గంలో భారీగా మార్పులు! … ప్రధాని ఏమన్నారంటే?

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>