Mobile Popup Ad
Mobile Popup Ad

రోడ్డు పక్కన ఆగి ఫోన్ మాట్లాడుతుండగా.. క్షణాల్లోనే ఘోరం!

కలం, వెబ్‌డెస్క్: ప్రకాశం (Prakasam) జిల్లా ఉలవపాడు మండలంలో ఊహించని రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. కరేడు గ్రామానికి చెందిన తండ్రికొడుకులు రూ. 9 లక్షల నగదు తీసుకుని బైక్‌పై బయలుదేరారు. మార్గమధ్యలో ఫోన్ రావడంతో బైక్‌ను రోడ్డు పక్కన ఆపి, అక్కడే ఉన్న ఒక ఆటో పక్కన నిలబడి మాట్లాడుతున్నారు.

ఈ క్రమంలో అతివేగంగా వచ్చిన ఒక లారీ అదుపుతప్పి ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలోని మామిడి కాయల ట్రేలు, ఆటో ఒక్కసారిగా తండ్రికొడుకులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తండ్రి పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోగా.. కొడుకుకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>