ఢిల్లీ అగ్ని ప్ర‌మాదంపై మోదీ స్పంద‌న‌.. బాధితుల‌కు ఎక్స్‌గ్రేషియా

క‌లం, వెబ్ డెస్క్: ఢిల్లీ (Delhi)లోని షాద‌రా జిల్లా వివేక్ విహార్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 9 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొంటూ, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుండి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఆదివారం తెల్లవారుజామున ఒక నివాస భవనంలో ఏసీ పేలడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌లో 9 మంది ప్రాణాలు కోల్పోవ‌డంతో పాటు మ‌రికొంద‌రు గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌కు ప‌లు ఆస్ప‌త్రుల్లో చికిత్స కొనసాగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>