కలం మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా ఫసల్ వాది (Fasalwadi) గ్రామ పంచాయతీ “విమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ” విభాగంలో జాతీయ అవార్డుకు ఎంపికైంది. మహిళా సాధికారత, భద్రత, అరోగ్య ,సంక్షేమ కార్యక్రమాల అమలులో ఈ పంచాయతీ విశేషమైన కృషికి చేసినందుకు 2025 సంవత్సరానికి సంబంధించి ఈ ప్రతిష్టాత్మక అవార్డును సాధించింది ఫసల్ వాది గ్రామం. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు (DDUPSVP) భాగంగా తెలంగాణ రాష్ట్రం నుండి ఫలస్ వాది పంచాయతీ ఈ ఘనతను సాధించింది.
మహిళ సాధికారతను ప్రొత్సహించేలా కేంద్రం అవార్డులు
దేశవ్యాప్తంగా ఉన్న గ్రామపంచాయితీలలో మహిళలకు సమాన అవకాశాలు, నిర్ణయాధికారం కల్పించడంలో ఫసల్ వాది పంచాయతీ ఆదర్శంగా నిలిచింది. ఫసల్ వాది పంచాయితీ దేశంలో అత్యత్తమంగా PAI 93.24 స్కోరుతో A+ గ్రేడ్ ను సాధించి జాతీయ స్ధాయి పురస్కారంకు ఎంపికైంది. ఈ గ్రామంలో మహిళల కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను కేంద్ర పంచాయితీ రాజ్ సభ్యులు క్షేత్రస్ధాయిలో పరిశీలించి, గ్రామ మహిళలతో మాట్లడి అవార్డును ప్రకటించారు. గ్రామాల్లో మహిళలకు పరిపాలనలో భాగస్వాములను చేస్తూ రక్షితమైన, సమానమైన, అభివృద్ధి అవకాశాలు కల్పిస్తున్న పంచాయతీలను గుర్తించి కేంద్ర పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ అవార్డులను ఇస్తుంది. ఫసల్ వాది గ్రామ పంచాయతీకి కేంద్ర ప్రభుత్వం వుమెన్ ప్రెండ్లీ విలేజ్ (National Women Friendly Panchayat)గా ప్రతిష్టాత్మక అవార్డును ప్రకటించింది.
మహిళ శక్తి సత్తా చాటేలా కార్యక్రమాలు
సంగారెడ్డి పట్టణంకు శివారుగా ఉన్న ఫసల్ వాది గ్రామంలో మొత్తం జనాభ 3554 మంది కాగా మహిళలు 1753, పురుషులు 1801 మంది ఉన్నారు. ఫసల్ వాది గ్రామంలో మహిళలను అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించి, గ్రామ ప్రగతిలో భాగస్వాములను చేసేలా ప్రణాళికను పక్కాగా అమలు చేశారు. ముఖ్యంగా గ్రామంలో బాలికల విద్య ప్రొత్సహించడంతో పాటు మహిళల విద్య పైన కుడా అవగాహన కల్పించారు. బాలికల డ్రాప్ అవుట్స్ లేకుండా చూడటంతో పాటు ఉన్నత విద్య కోసం ప్రోత్సాహం అందించారు. గ్రామంలోని మహిళల అర్ధిక పురోగతే గ్రామ అర్ధిక అభివ్రద్ధిగా భావించారు. అందుకోసం స్వయం సహయంక గ్రూపులను (SHG) ప్రోత్సహించడంతో పాటు, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేశారు. డ్వాక్రా మహిళల సంఘల ద్వార రుణాలు తీసుకోని సకాలంలో కడుతూ అర్ధికంగా ప్రగతి సాధించారు.
మహిళకు స్వయం ఉపాధి పథకాలు..
గ్రామంలోని మహిళల అర్ధికంగా ఎదగడానికి స్వయం ఉపాధి పథకాలు అమలు చేశారు. ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యచరణతో వారు సొంతంగా ఎదగడానికి మహిళలకి శిక్షణ, అవగాహన కార్యక్రమాలు కల్పించారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధన్యం ఇచ్చారు. గ్రామంలో మహిళల భద్రతకు పెద్దపీట వేయడంతో పాటు, గృహహింస, వేధింపుల నివారణకు చర్యలు తీసుకున్నారు. బాల్య వివాహలు, మహిళల పట్ల చిన్న చూపు లేకుండా వ్యవహరించారు.మహిళల అరోగ్యం విషయంలో ప్రత్యేక ప్రణాళికను అమలు చేశారు. అందుకోసం గర్భిణీ స్త్రీల సంరక్షణ, ఆరోగ్య సేవలు, పోషణ కార్యక్రమాలు అమలు చేశారు. గ్రామంలోని అంగన్ వాడీ, అశ వర్కర్ల ద్వార ఫసల్ వాడి గ్రామంలో వివిధ రకాల ప్రభుత్వ సేవలను సమర్ధవంతంగా నిర్వహించారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా పౌష్ఠిక అహరం అందేలా చర్యలు తీసుకున్నారు. శిశువు నుండి పెద్ద వారి వరకు మహిళ అరోగ్యం కోసం విషయంలో అవగహన కల్పించారు. ఫసల్ వాడీ గ్రామంలో జరిగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పెద్దఎత్తున మహిళలను భాగస్వాములను చేశారు.
స్త్రీ, పురుష లింగభేదం లేకుండా పరిపాలన..
గ్రామ సభల్లో మహిళల పాల్గోనేలా చేయడంతో, స్థానిక పాలనలో మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించారు. స్త్రీ, పురుష లింగభేదం లేకుండా పరిపాలనతో సహ అన్ని రంగాల్లో మహిళలకు అవకాశలు వచ్చేలా ప్రయత్నం చేశారు. గ్రామాలను మహిళ సాధికరత సాధించేలా, మహిళ శక్తిని ప్రోత్సహించేలా మహిళలు సమానంగా అవకాశలను కల్పిస్తూ అభివృద్ధిలో భాగస్వాములను చేయడం చేశారు. మంచి పని చేసిన పంచాయతీలను దేశానికి ఆదర్శంగా చూపించడం. ఇలా ఫసల్ వాడి గ్రామంలోని మహిళల అభ్యున్నతి కోసం కృషి చేసినందుకు కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక వుమెన్ ప్రెండ్లీ పంచాయితీగా అవార్డును సాధించింది. తమ పంచాయతీకి జాతీయ స్థాయి అవార్డు రావడం పట్ల గ్రామ ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన కెటగిరిలో దేశంలోనే ఇచ్చే జాతీయ అవార్డు ఫసల్ వాది గ్రామ పంచాయతీ సాధించడం గర్వంగా ఉందని చెబుతున్నారు.

