కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలో (Mahabubnagar) రేపటి (మే 4వ తేదీ) నుండి మే 9 వరకు రైతు వారోత్సవాలు నిర్వహించి.. రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. రైతు వారోత్సవాల్లో భాగంగా మొదటి రోజు నేల ఆరోగ్య పరిరక్షణ, సమతల ఎరువుల యాజమాన్యం- ప్రకృతి వ్యవసాయం, మే 5న ఉద్యాన పంటల సాగు, ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంపుదల – ప్రత్యామ్నాయ పంటల సాగు, మే 6న బ్యాంకుల ద్వారా దీర్ఘకాలిక, స్వల్పకాలిక వంట రుణాలు సహకార సంఘాలు – ఎఫ్.పి.ఓ ల ద్వారా రైతులకు సేవలు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలు, మే 7న వ్యవసాయ క్షేత్రాలు, సౌర విద్యుత్ కేంద్రాలు- పి.ఎం. కుసుమ్ వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్స్ అలాగే మే 8న పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ- పశుజాతి అభివృద్ధి, దూడల ప్రదర్శన, గడ్డి విత్తనాలు- వేసవిలో పశు సంరక్షణ, మత్య శాఖ ద్వారా చెరువులలో కలుపు మొక్కల నివారణ, వ్యాధుల నియంత్రణ,అధికోత్పత్తికి చర్యలు, నీటిపారుదల శాఖ ద్వారా సమర్థ నీటి విడుదల కొరకై గేట్ల నిర్వహణ, ఎతిపోతల పథకాల మరమ్మత్తులు, కాలువలలో కంపచెట్లు గుర్రపు డెక్క తొలగింపు, మే 9న నీటిపారుదల శాఖ ద్వారా చెరువులలో కంపచెట్లు, గుర్రపు డెక్క తొలగింపు, సమతుల్య నీటి వినియోగం, కార్యాలయాల పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. షెడ్యూల్ వారీగా ప్రతి రోజు ప్రజలు, ప్రజా ప్రతినిధులు, రైతులను భాగస్వామ్యులను చేస్తూ వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, మత్స్య శాఖ, నీటి పారుదల శాఖ, పశు సంవర్థక శాఖ, సహకార శాఖలు సమన్వయంతో కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
Read Also: ఫస్ట్ ఇంప్రెషన్‌ను పాడుచేసే అలవాట్లు ఏంటో తెలుసా?
Follow Us On: Sharechat

