డిటర్జెంట్లు, కెమికల్స్‌తో పాల కల్తీ.. ముఠా గుట్టురట్టు

కలం, వెబ్ డెస్క్: మహారాష్ట్ర (Maharashtra)లో భారీ కల్తీ పాల ముఠా (Fake Milk Racket) గుట్టురట్టయింది. డిటర్జెంట్లు, కెమికల్స్ ఉపయోగిస్తూ కృత్రిమ పాలను తయారు చేస్తున్న కల్తీ ముఠాను ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ (FDA) అధికారులు అరెస్ట్ చేశారు. లాతూర్, పూణే, సోలాపూర్ జిల్లాల్లో అధికారులు ఆకస్మిక నిర్వహించి వేలాది లీటర్ల కల్తీ పాలు, పన్నీర్, ఖోయా వంటి డైరీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సేల్స్ రిజిస్ట‌ర్ల‌ను స్వాధీనం చేసుకొని పరిశీలించారు.

గత ఆరు నెలల్లో మార్కెట్లో 2.3 కోట్ల లీటర్ల విషపూరిత కల్తీ పాలు విక్రయించినట్లు అధికారులు వెల్లడించారు. మార్కెట్ లో ఈ పాల విలువ రూ. 9.21 కోట్లు ఉంటుందని అంచ‌నా వేస్తున్నారు. ఈ క‌ల్తీ పాల (Toxic Adulterated Milk) త‌యారీకోసం 2,30,470 కిలోల క్వాలిటీ లేని పాలపొడిని ఉపయోగించినట్లు ద‌ర్యాప్తులో వెల్లడించారు. పాలు చిక్కగా కనిపించేందుకు నిందితులు డిట‌ర్జెంట్ పౌడ‌ర్‌, పామాయిల్‌, నాసిరకం మిల్క్ పౌడర్ వాడినట్లు దర్యాప్తులో తేల్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>