కళ్లల్లో పెప్పర్​ స్ప్రే కొట్టి రూ.30 లక్షల నగలు ఎత్తుకెళ్లారు!

క‌లం, వెబ్‌డెస్క్‌: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో భారీ న‌గ‌ల చోరీ (Jewellery Theft) వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌చ్చింది. రోహిణి సెక్టార్ 18, సామయ్‌పూర్ బాద్లీ ప్రాంతంలో ఈ దోపిడీ ఘటన జ‌రిగింది. స్థానిక జ్యువెల్లరీ షాప్‌లోకి క‌స్ట‌మ‌ర్‌లా వ‌చ్చిన వ్య‌క్తి పగటిపూటే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. మొదట అత‌డు కస్టమర్‌లా లోపలికి ప్ర‌వేశించారు. య‌జ‌మానితో మాట్లాడుతూ బ్రేస్‌లెట్లు చూపించ‌మ‌ని అడిగాడు. ఇలా ధ‌ర‌ల గురించి య‌జ‌మానిని మాట‌ల్లో పెట్టి కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టాడు. క్షణాల వ్యవధిలో త‌న ముందున్న ఆభ‌ర‌ణాల‌ను ప‌ట్టుకొని ఉడాయించాడు. వీటి విలువ సుమారు రూ.30 లక్షల వ‌ర‌కు ఉంటుంద‌ని య‌జ‌మాని తెలిపారు.

ఈ దోపిడీకి సంబంధించిన దృశ్యాలన్నీ షాప్‌లోని సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పరారీలో ఉన్న నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>