అశ్వరావుపేటలో దొంగనోట్ల ముఠా అరెస్ట్

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట (Aswaraopeta) లో దొంగనోట్ల ముఠా (Fake Currency Gang) ను పోలీసులు అరెస్ట్ చేయడంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ నెల 15న అశ్వరావుపేటలోని ఓ ఫర్నీచర్ దుకాణంలో నిందితులు రూ.14,500 చెల్లించి సోఫా కొనుగోలు చేశారు. అనంతరం ఆ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేయగా, అందులో రూ.5,500 నకిలీ నోట్లు ఉన్నట్లు బ్యాంకు సిబ్బంది గుర్తించారు. దీంతో షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తులో దమ్మపేట మండలానికి చెందిన దుర్గా ప్రసాద్, ముత్యాల రావు, ఆంధ్రప్రదేశ్ ఏలూరుకు చెందిన కోడెళ్ళి చిన్ని కలిసి ముఠాగా (Fake Currency Gang) ఏర్పడి సామాన్య ప్రజలు, చిరు వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని నకిలీ నోట్ల మార్పిడి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అశ్వరావుపేటలోని ఓ ఇంట్లో దాక్కున్న వీరిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు పాల్వంచ డీఎస్పీ సతీష్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.5,500 నకిలీ నోట్లు, మూడు సెల్‌ఫోన్‌లు , రూ.2,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

Read Also: గ్రామసభల్లో తీర్మానంతో ఫ్యూచర్‌ సిటీలో చేరిక : సీఎం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>