ప్రజల సమస్యలపై తప్పకుండా దృష్టి పెడతాం: ఈటల

కలం, వెబ్ డెస్క్: సమస్యాత్మక ప్రాంతాల్లో తిరిగి పనుల పర్యవేక్షణ చేసి, ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలపై తప్పకుండా దృష్టి పెడతామని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ ఎల్బి నగర్ అసెంబ్లీ పరిధిలోని చంపాపేట్ డివిజన్ లో మంగళవారం పలు కాలనీ సమస్యలను పరిశీలించి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సాయి నగర్ మద్దెల చెరువు ఒక మురికి కూపం లాగా ఉండేదని చెప్పారు. ఈ ప్రాంతంలో ఉన్న డ్రైనేజ్ అంత ఇక్కడే నిల్వ ఉండి, ఈగలు, కంపు వాసన, చుట్టుపక్కల ఎక్కడ బోరు వేసినా కలుషితమైన నీరుతో సతమతమవుతున్నారాని దివంగత నేత వంగ మధు మంచినీళ్ల చెరువుగా మార్చాలని రూ.కోటితో డ్రైనేజీ పైప్ లైన్ వేయించారని తెలిపారు. కానీ శుభ్రపరిచే వాళ్ళు లేక పైపు కెపాసిటీ సరిపోక అధికంగా ఉన్న నీరు కూడా చెరువులోకి పోయి మళ్ళీ మురికి కూపం లాగా మిగిలిపోయిందని చెప్పారు. దీని ప్రక్షాళన కోసం మురికి నీరు చెరువులోకి రాకుండా ఉండటం కోసం, అవసరమైతే ఇంకో పైప్లైన్ వేసి దాని కెపాసిటీ పెంచుతామని హామీ ఇచ్చారు.

చెరువు దగ్గర జులాయిల, పోకిరిల అడ్డాగా మారిపోయిందని.. ఇది మాదకద్రవ్యాలకు అడ్డాగా కాకుండా ఉండాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఈటల (Eatala Rajender) తెలిపారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్ కూడా వేయించాలని కోరారని.. దానిపై తాను అధికారులతో మాట్లాడి వేయించే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు ప్రజలు సమస్యలతో సతమతమవుతుంటే రాజకీయాల, ఫోటోల, ఆధిపత్యం కోసం పాకులాడే వాళ్ళని చూస్తున్నామని విమర్శించారు. ప్రజలకు ఎవరు ఏం చేస్తారో గమనిస్తూనే ఉన్నారని అన్నారు. హైదరాబాదులో ఎక్కడ చూసినా ఏదో ఒక మూలన పైప్ లైన్ కోసం తవ్వుతూనే ఉంటారని.. వేగంగా పెరుగుతున్న సిటీకి అనుగుణంగా పైప్లైన్ కెపాసిటీ ఉండాలన్నారు.మెగా ఫంక్షన్ హాల్ దగ్గర రూ. 6 కోట్లతో కొత్త బాక్స్ డ్రైనేజీ కట్టిస్తామని.. దాన్ని కూడా అధికారులతో మాట్లాడి సకాలంలో పూర్తయ్యే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.

Read Also: గ్రామసభల్లో తీర్మానంతో ఫ్యూచర్‌ సిటీలో చేరిక : సీఎం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>