Mobile Popup Ad
Mobile Popup Ad

బేకరీ మాఫియా.. కుళ్లిపోయిన గుడ్లు, రసాయనాలతో కేకుల తయారీ!

కలం, వెబ్ డెస్క్: నిజంగానే మనుషులు ఇంత దిగజారిపోతున్నారా అనిపించే ఘటన ఇది. హైదరాబాద్‌లోని (Hyderabad) కాటేదాన్ ప్రాంతంలో చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ బేకరీ యూనిట్‌‌ను మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు గుట్టు రట్టు చేశారు. మధురై మీనాక్షి ఫుడ్ కంపెనీ పేరుతో కుళ్లిపోయిన గుడ్లు, ప్రాణాంతకమైన సింథటిక్ రంగులు, హానికర రసాయనాలను ఉపయోగిస్తూ కేకులు (Cakes), బిస్కెట్లు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ అక్రమాలకు పాల్పడుతున్న అఫ్రిది అంసారి, యాసీన్, ఖత్రేశన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్కెట్‌లో అసలు ఉత్పత్తుల మాదిరిగానే వీటిని విక్రయిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యాన్ని తీవ్ర ప్రమాదంలోకి నెడుతున్న ఈ ముఠా నుంచి భారీగా పాడైన గుడ్లు, నిల్వ ఉంచిన రసాయనాలు, కల్తీ ఫ్లేవర్లను స్వాధీనం చేసుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>