Mobile Popup Ad
Mobile Popup Ad

పాడి కౌశిక్ రెడ్డిపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు

క‌లం, వెబ్ డెస్క్‌: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై (Kaushik Reddy) మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌కు ఫిర్యాదు అందింది. ఇటీవ‌ల క‌రీంన‌గ‌ర్‌లోని వీణ‌వంక‌లో స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ జాత‌ర‌లో పాడి కౌశిక్ రెడ్డి హైకోర్ట్ ఆదేశాల‌ను ఉల్లంఘించార‌ని, పోలీసుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని క‌రీంన‌గ‌ర్‌లో కేసు న‌మోదైంది. క‌రీంన‌గ‌ర్ సీపీని మ‌తం పేరుతో కౌశిక్ రెడ్డి దూషించార‌ని, ఆయ‌న‌పై మ‌త మార్పిడి ఆరోప‌ణ‌లు చేశార‌ని పోలీసులు పేర్కొన్నారు. దీంతో తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (TMREIS) వైస్ చైర్మన్ ఫహీం ఖురేషి(Faheem Qureshi) మాన‌వ హ‌క్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు.

కౌశిక్ రెడ్డి పోలీస్ అధికారిని మతం పేరుతో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం, మ‌త‌ప‌ర విద్వేషాలు రెచ్చ‌గొడుతున్న కౌశిక్ రెడ్డిని (Kaushik Reddy) పార్టీ నుంచి 24 గంట‌ల్లో స‌స్పెండ్ చేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ ఒక్క ఘ‌ట‌న‌తో మైనారిటీలపై బీఆర్ఎస్ పార్టీ వైఖ‌రి ఏమిటో స్ప‌ష్టవుతున్న‌ద‌ని ఫహీం వ్యాఖ్యానించారు.

 Read Also: సింహం గుర్తుకు ఫుల్ డిమాండ్.. రెబల్స్ అంతా అటువైపే మొగ్గు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>