భద్రకాళి బండ్‌పై శని గ్రహం, వలయాలు, చంద్రుడిని వీక్షించే అవకాశం

కలం, హనుమకొండ: దసరా సెలవుల సందర్భంగా వరంగల్‌లోని భద్రకాళి బండ్‌ (Bhadrakali Bund)పై ఎక్స్‌ప్లోరా 2.0 ఖగోళ విజ్ఞాన కార్యక్రమం ప్రారంభమైంది. అక్టోబర్ 26 వరకు సాయంత్రం వేళల్లో జరిగే ఈ కార్యక్రమంలో టెలిస్కోపుల ద్వారా శని గ్రహం, దాని వలయాలు, చంద్రుడిని వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు.

ఏటీడీఆర్‌ఎల్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ల్యాబ్‌ ఆధ్వర్యంలో, కుడా సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వీఆర్‌ స్పేస్‌ జోన్‌, ఆస్ట్రానమీ జోన్లను ఏర్పాటు చేశారు. వర్చువల్‌ రియాలిటీ సాంకేతికతతో అంతరిక్ష విశేషాలను తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు.

విద్యార్థుల్లో సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, గణితం (స్టెమ్‌) పట్ల ఆసక్తిని పెంపొందించడం, ఖగోళ శాస్త్రంపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ఉద్దేశం. కుడా ఛైర్‌పర్సన్‌ గుండు సుధారాణి, హనుమకొండ జిల్లా కలెక్టర్‌, కుడా వైస్‌ ఛైర్‌పర్సన్‌ చాహత్‌ బాజ్‌పాయి సోమవారం కార్యక్రమ వివరాలను వెల్లడించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఖగోళ విజ్ఞానంపై ఆసక్తి ఉన్నవారు ఈ నెల 26 వరకు భద్రకాళి బండ్‌లో జరిగే కార్యక్రమాన్ని సందర్శించవచ్చు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>