కలం, జోగులాంబ గద్వాల: గద్వాల పట్టణంలోని వైఎస్సార్ చౌక్‌లో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు సమతా మధు గౌడ్ (Samatha Madhu Goud) ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ఎంపీ అంగోమ్చా బిమోల్ అకోయిజమ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. జేఎన్‌యూలో ప్రొఫెసర్‌గా పనిచేస్తూ మణిపూర్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన అంగోమ్చా బిమోల్.. మహిళా విద్యార్థినులను లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఆయనపై విచారణ జరిపి.. చట్ట ప్రకారం కఠిన శిక్ష విధించాలని సమత మధు గౌడ్ డిమాండ్ చేశారు. అలాగే ఎంపీ పదవి నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ మహిళా కానిస్టేబుళ్లతో దురుసుగా ప్రవర్తించారంటూ మండిపడ్డారు. ఈ ఆందోళనలో జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల వెంకట్రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ ఎక్బోటే, సమత మధు గౌడ్, మహిళా మోర్చా, యువమోర్చా నాయకులు పాల్గొన్నారు.

