కలం, వెబ్ డెస్క్ : బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు (Ex MLA Shakeel Son ) రాహీల్‌కు బిగ్ షాక్ తగిలింది. జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాహీల్ దుబ్బాయి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ మేరకు టికెట్ బుక్ చేసుకొని దుబాయ్ వెళ్లేందుకు సిద్దమైన రాహీల్ కు జూబ్లీహిల్స్ పోలీసులు షాక్ ఇచ్చారు. కేసు విచారణలో ఉన్నందున విదేశాలకు వీలు లేదని దుబాయ్ ప్రయాణాన్ని అడ్డుకున్నారు.
కాగా, 2022 మార్చి 17న జూబ్లీ హిల్స్ రోడ్డు నంబర్ 45 వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో రాహీల్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ప్రమాదం తర్వాత రాహీల్ దుబాయి పారిపోయాడు. పోలీసులు చివరికి లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడంతో దుబాయి నుంచి హైదరాబాద్ వచ్చిన రాహీల్ ను ఈ ఏడాది ఏప్రీల్ లో అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్ పై విడుదలైన రాహీల్ మళ్లీ దుబాయి వెళ్లేందుకు యత్నించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రాహీల్ ను వారించారు. విచారణ కొనసాగుతున్న క్రమంలో రాష్ట్రం విడిచి వెళ్లకూడదని.. విదేశాలకు వెళ్లాలంటే కోర్టు నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు.

