పాలకుర్తిలో దారుణం.. విద్యార్థినులను కరిచిన ఎలుకలు

కలం, జనగామ : జనగామ జిల్లా పాలకుర్తి (Palakurti) మండలంలోని సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో మంగళవారం సాయంత్రం 14 మంది విద్యార్థులను ఎలుకలు కరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఎర్రబెల్లి స్పందించి విద్యార్థులను పరామర్శించడానకి పాలకుర్తి లోని హాస్టల్ కు చేరుకున్నాడు. ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకునేందుకు లోనికి వెళ్తున్న ఎర్రబెల్లిని పోలీసులు అడ్డుకోవడంతో హాస్టల్ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. అనంతరం హాస్టల్ వార్డెన్, ప్రిన్సిపాల్ తో మాట్లడి విద్యార్ధులకు కల్పించాల్సిన వసతులు కల్పించకపోవడం పై ఇలాంటి ఘటనలు జారుతున్నాయని ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి గా ఉన్న రేవంత్ రెడ్డి సోషల్ వెల్ఫేర్ పాఠశాలను నిర్వీర్యం చేయడం వల్ల రాష్ట్రంలో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. మంగళవారం రోజు విద్యార్థులను ఎలుకలు కరిస్తే హాస్టల్​ సిబ్బంది నిర్లక్ష్యం చేయడం చాలా బాధాకరమన్నారు. ఈ ఘటనపై స్పందించకుండా నిర్లక్ష్యం వహించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లి డిమాండ్​ చేశారు. అనంతరం సాంఘీక సంక్షేమ పాఠశాల సెక్రటరి శారదతో మాట్లడి ఘటనపై వివరాలు వెల్లడించారు.

రేవంత్ రెడ్డి కి, స్థానిక ఎమ్మెల్యే కి చిత్త శుద్ది ఉంటే ఇప్పటికైనా పాఠశాలలను పట్టించుకోని విద్యార్థినీల భవిష్యత్తుకు బరోస కల్పించాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. మూడు సంవత్సరాలుగా హాస్టల్ లో విద్యార్ధులకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించక పోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు చేటు అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి విద్యార్ధుల భవిష్యత్తు గురించి ఆలోచన లేదని.. తన భవిష్యత్తు కోసం రాష్ట్రంలో నియంత పాలన నడిపిస్తున్నారని ఎర్రెబెల్లి ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి మండల బిఆర్ఎస్ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.​

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>