బీఆర్‌ఎస్‌ భయంతోనే ఎన్నికలు వాయిదా: ఎర్రబెల్లి

కలం, తొర్రూరు: మున్సిపాలిటీల్లో కో–ఆప్షన్ సభ్యుల ఎన్నికలను వెంటనే నిర్వహించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు (Errabelli Dayakar Rao) డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ఎక్కువగా ఉన్నారనే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేస్తోందని ఆరోపించారు. తొర్రూరులో బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కౌన్సిలర్లుగా ఎన్నికై ఏడాది కావస్తున్నా కో ఆప్షన్ ఎన్నికలు నిర్వహించకపోవడంపై ప్రశ్నించారు. తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌కు ఛైర్మన్ పీఠం దక్కే అవకాశం ఉందనే కారణంతోనే ఎన్నికలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి..

ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మాజీ సీఎం కేసీఆర్ భూముల అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఎర్రబెల్లి విమర్శించారు. సీఎం రేవంత్‌ రెడ్డి, ఆయన సోదరులకు రూ.వందల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు వివరించాలన్నారు. రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొంటూ రైతుబంధు, యూరియా, విద్యుత్, రుణమాఫీ, సాగునీరు, రైతుబీమా అంశాల్లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో అమలు చేసిన రైతు, మహిళా సంక్షేమ పథకాలను కొనసాగించాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>