వినయ్ భాస్కర్‌పై దాడి పిరికిపంద చ‌ర్య: ఎర్ర‌బెల్లి

క‌లం, వ‌రంగ‌ల్: వ‌రంగ‌ల్‌లో ఎంజీఎం ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే విన‌య్‌ భాస్క‌ర్ (Dasyam Vinaya Bhaskar) పోలీసులు దాడి చేయ‌డం పిరికిపంద చ‌ర్య అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) అన్నారు. ఎంజీఎం సంద‌ర్శ‌న‌లో విన‌య్ భాస్క‌ర్ గాయ‌ప‌డ‌టంపై ఎర్ర‌బెల్లి స్పందించారు. ఎంజీఎం ఆసుపత్రిలో పెచ్చులు ఊడి అధ్వాన్నంగా త‌యారైంద‌ని, బెడ్లు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రోగుల‌కు సరైన వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి సందర్శనకు వెళ్తున్న వినయ్ భాస్కర్ మీద పోలీసులు చేసిన‌ దాడికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాల‌ని డిమాండ్ చేశారు.

ప్ర‌భుత్వ చేత‌గాని త‌నంపై ప్ర‌శ్నిస్తున్న‌ ప్రతిపక్షాల గొంతు నొక్కడమే సీఎం రేవంత్ ప‌నిగా పెట్టుకున్నార‌ని ఎర్ర‌బెల్లి మండిప‌డ్డారు. విన‌య్ భాస్క‌ర్‌పై పోలీసులు పిడి గుద్దులు కురిపిస్తూ దాడి చేశార‌ని ఆరోపించారు. దాడి చేసిన పోలీసుల మీద చర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీసుల దౌర్జ‌న్యాలు కూడా పెరిగిపోయాయ‌ని ఎర్రెబెల్లి ఆరోపించారు. మొన్న అసెంబ్లీ వద్ద మహిళా ఎమ్మెల్యేల మీద, అలాగే కేటీఆర్, హరీష్ రావు మీద‌, త‌న మీద కూడా దాడి చేశార‌ని అన్నారు. రేవంత్ రెడ్డి పరిపాలన దుర్మార్గమైనద‌ని, ప్రజల పక్షాన నిలబడే నాయకుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా బాధార‌మ‌ని అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>