సెప్టెంబర్‌లో థియేటర్లలోకి ‘ఎపిక్’.. రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్!

కలం, వెబ్ డెస్క్: ‘బేబి’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) జోడీ తాజా ప్రాజెక్టు ‘ఎపిక్’ (Epic Movie) ఆదిత్య హాసన్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను తాజాగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ప్రకటించింది.

సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని తెలిపింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు ఆకట్టుకుంటున్నాయి. హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా, ఇటీవలే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని హీరోయిన్ వైష్ణవి చైతన్య దర్శించుకొని.. బోనం సమర్పించింది. కెరీర్లో ఎదిగేలా ఆశీర్వదించాలని, అందరూ బాగుండాలని అమ్మవారిని మొక్కుకుంది.

 Also Read : మ‌హేశ్ బ‌ర్త్‌డేకు స‌ర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన రాజ‌మౌళి!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>