చెవి నొప్పి అని వెళ్తే.. యువతి చేయి తొలగించిన వైద్యులు!

కలం, వెబ్ డెస్క్: వైద్యుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాల మీదికి తెస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. చికిత్స చేస్తుండగా వైద్యుల నిర్లక్ష్యంతో అనూహ్య ఘటనలు జరుగుతున్నాయి. ఆపరేషన్ సమయంతో ఎక్విప్‌మెంట్‌ను శరీరంలో పెట్టడం, మందులు, మత్తు ఇంజక్షన్ సరైన మోతాదు కంటే ఎక్కువగా ఇవ్వడం లాంటి ఘటనలు రోగుల కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని మిగిల్చుతున్నాయి. యాక్సిడెంట్, అయినప్పుడో లేదా పురిటి నొప్పులు అయినప్పుడు అత్యవసర చికిత్స కోసం వస్తున్న బాధితులు.. విగతజీవులుగా ఇంటికి వెళ్తున్నారు. వైద్యాధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. బీహార్‌ (Bihar)లో జరిగిన ఇలాంటి మరో ఘటనే ఇప్పుడు సంచలనంగా మారింది.

కొద్ది రోజులు పెళ్లి.. అంతలోనే..

చెవినొప్పి ఉందని ఆసుపత్రిని సంప్రదించిన యువతికి (Bihar Woman) తీరని బాధని మిగిల్చారు అక్కడి వైద్యులు. కొద్ది రోజులు పెళ్లి జరుగనుడటంతో తన జీవితంలో కాబోయే వాడు వస్తున్నాడనే ఆశతో ఉన్న యువతికి జీవితాంతం వెంటనే దుఃఖాన్నే మిగిల్చారు. బీహార్ రాజధాని పాట్నాలో చెవి నొప్పిగా ఉండటంతో.. చికిత్స కోసం మహావీర్ ఆరోగ్య సంస్థాన్‌కి రేఖ(20) అనే యువతి వెళ్ళింది. అయితే.. చికిత్స చేసే సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా (Doctors Negligence) వ్యవహరించి ఆమెకి తప్పుడు ఇంజెక్షన్ ఇచ్చారు. పరిస్థితి విషమించడంతో ఆమె చేయి ఆకుపచ్చ రంగులోకి మారింది. తీవ్ర నొప్పితో విలవిలడంతో తూతూమంత్రంగా పరీక్షించిన వైద్యులు.. అదేం పెద్ద సమస్య కాదని కొట్టిపారేశారు.

చెయ్యి తొలగించాల్సిందే

నొప్పి తీవ్రతరం అవడంతో బాధ భరించలేక సదరు యువతి ఆ ఆసుపత్రి నుంచి వేరొక ‘మేదాంత’ అనే హాస్పిటల్‌కి వెళ్ళింది. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు.. ఇంజక్షన్ వికటించడంతో చేయి పాయిజన్ అయిందని, ఇంకా ఆలస్యం చేస్తే శరీరం అంతటా విస్తరిస్తుందని తెలిపారు. ప్రాణాలతో ఉండాలంటే చేయి తొలగించాల్సిందేనని యువతికి వైద్యులు తేల్చి చెప్పారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ యువతి.. ఇక చేసేదేం లేక తీవ్రంగా దుఃఖిస్తూనే అందుకు అంగీకరించింది. వెంటనే చికిత్స ప్రారంభించిన వైద్యులు, పాయిజన్ వ్యాపించిన చేయిని తొలగించి యువతి ప్రాణాలు కాపాడారు.

గుండెలవిసేలా ఏడ్చిన యువతి

చికిత్స అనంతరం స్పృహలోకి వచ్చిన యువతి, తన చేయి శరీరం నుంచి వేరు కావడాన్ని తట్టుకోలేక విలవిలా ఏడ్చింది. మహావీర్ ఆరోగ్య సంస్థాన్‌ వైద్యుల నిర్లక్ష్యానికి తన జీవితం నాశనమైందంటూ రేఖ కన్నీరుమున్నీరుగా విలపించింది. యువతికి చేయి లేదని తెలుసుకున్న ఆమెకు కాబోయే వ్యక్తి, అతని తల్లిదండ్రులు సంబంధాన్ని తెంచుకున్నారు. ఈ ఘటన కారణంగా తనకొచ్చిన పెళ్లి సంబంధం కూడా రద్దు కావడంతో యువతి కన్నీరుమున్నీరుగా విలపించింది. చేయి పోయి పుట్టెడు దుఃఖంతో ఉన్న యువతి రేఖకు పెళ్లి సంబంధం కూడా విచ్చిన్నం కావడంతో తీవ్ర మనోవేదనతో గుండెలవిసేలా ఏడ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. సదరు యువతికి వచ్చిన బాధ ఎవరికీ రాకూడదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read : ఢిల్లీ పార్టీల చేతిలో తల్లడిల్లుతున్న తెలంగాణ: కేటీఆర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>