Mobile Popup Ad
Mobile Popup Ad

ఇంగ్లాండ్‌కు తొలి షాక్.. సాల్ట్ ఔట్

కలం, వెబ్​ డెస్క్​: టీ20 వరల్డ్​ కప్​ సెమీస్​లో 254 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు మొదటి ఓవర్లోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన మొదటి ఓవర్లోనే ప్రమాదకరమైన ఫిల్ సాల్ట్‌న(Phil Salt) అవుట్ చేసి భారత్‌కు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా వేసిన బంతిని భారీ షాట్ ఆడబోయిన ఫిల్ సాల్ట్ (5 పరుగులు), అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పాయింట్ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న అక్షర్ ఏమాత్రం తడబడకుండా ఈ క్యాచ్‌ను అందుకోవడంతో ఇంగ్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది. కేవలం 1.1 ఓవర్లకే ఇంగ్లాండ్ 13 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయి ఒత్తిడిలో పడింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>