ఒకే కారులో విజయ్, త్రిష.. లేటెస్ట్ వీడియో వైరల్

కలం, వెబ్ డెస్క్: తమిళ స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్.. నటి త్రిషతో (Vijay-Trisha) డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య సంబంధాలున్నాయని, విజయ్ భార్య సైతం ఆరోపించడంతో ఈ వ్యవహారం కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో చెన్నైలో జరిగిన కల్పాతి ఎస్. సురేశ్- మీనాక్షి సురేశ్ దంపతుల కుమారుడి వివాహ రిసెప్షన్‌కు వీరిద్దరూ హాజరయ్యారు.

ఓ వివాహ రిసెప్షన్‌కు విజయ్, త్రిష ఒకే కారులో రావడం, వేడుకలో పక్కపక్కనే కూర్చుని ముచ్చటించడం వంటి దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు చూస్తుంటే గతంలో డేటింగ్ (Dating) రూమర్స్ నిజమేనేమో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వార్తలపై అటు విజయ్ గానీ,  ఇటు త్రిషగానీ ఖండించలేదు. విజయ్‌ను  రాజకీయంగా దెబ్బ తీయడానికే ఇతర పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నారని విజయ్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Kalamdaily (@kalamtelugu)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>