ఒక్కసారి నా ఇల్లు చూసుకుంటా.. ఖ‌మ్మం ఇళ్ల‌ కూల్చివేత‌ల్లో మ‌హిళ ఆవేద‌న‌

క‌లం, వెబ్ డెస్క్‌: ఖ‌మ్మంలోని వెలుగుమ‌ట్ల‌ (Velugumatla)లో భూదాన్ భూముల్లో ఇండ్ల కూల్చివేత తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. స్థానికంగా ఇళ్లు క‌ట్టుకున్న వారి ఆందోళ‌న‌ న‌డుమ పోలీసులు భారీ భ‌ద్ర‌త‌తో కూల్చి వేత‌లు చేప‌ట్టారు. గ‌త రెండు రోజులుగా వెలుగుమ‌ట్ల‌లో భారీ ఎత్తున పోలీసు బ‌ల‌గాలు మోహ‌రించాయి. ఈ కూల్చివేత‌ల కోసం నాలుగు జిల్లాల నుంచి పోలీసులు వ‌చ్చారు. ప‌దేళ్ల నుంచి ఇక్క‌డ ఇండ్లు క‌ట్టుకొని ఉంటున్నామ‌ని స్థానికులు క‌న్నీరుమున్నీరుగా విల‌పించారు. త‌మ‌కు దారి చూపుతార‌ని పొంగులేటి శ్రీనివాస్‌ను, రేవంత్ రెడ్డిని గెలిపించుకుంటే గూడు లేకుండా చేశార‌ని బాధ ప‌డుతున్నారు.

ప్ర‌స్తుతం ఇండ్లు కోల్పోయిన వారంతా స్థానికంగా రోడ్డు ప‌క్క‌న‌, చెట్ల కింద ఉన్నారు. ఇండ్ల కూల్చివేత స‌మ‌యంలో ఓ మ‌హిళ ఏడుస్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఒక్కసారి నా ఇల్లు చూసుకుంటానంటూ పోలీసుల‌ను రిక్వెస్ట్ చేసుకొని ఏడుస్తూ ఇల్లంతా క‌లియ‌తిరిగింది. మ‌రోవైపు వెలుగుమ‌ట్ల‌లో (Velugumatla) ఇండ్లు కూల్చేసిన వారికి ఇందిర‌మ్మ ఇండ్లు అందించాల‌ని అధికారుల‌ను మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు (Thummala Nageswara Rao) ఆదేశించారు.

Read Also : ‘రాజ్యసభ’ వారికే కేటాయించండి : జగ్గారెడ్డి కీలక ప్రతిపాదన

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>