epaper
Saturday, January 17, 2026
spot_img
epaper

ప్రాణం తీసిన ఫోటోల స‌ర‌దా.. స‌ర‌స్సులో ప‌డి ఇద్ద‌రు మృతి

క‌లం వెబ్ డెస్క్‌ : కొంత‌మంది ట్రిప్‌ల‌కు వెళ్లిన‌ప్పుడు స‌ర‌దా కోసం చేసే ప‌నుల‌తో ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు. సంతోషంగా ముగియాల్సిన ప‌ర్య‌ట‌న‌లు తీర‌ని విషాదాన్ని మిగిలిస్తున్నాయి. తాజాగా అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో (Arunachal Pradesh) ఓ విషాద‌క‌ర ఘ‌ట‌న జ‌రిగింది. చ‌లికాలంలో అరుణాచ‌ల్ అందాల‌ను వీక్షించేందుకు వ‌చ్చిన ప‌ర్యాట‌కుల‌కు తీర‌ని దుఖాన్ని మిగిల్చింది. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని సెలా స‌ర‌స్సు (Sela Lake) చ‌లి తీవ్ర‌త‌కు గ‌డ్డ‌క‌ట్ట‌పోయింది. దీంతో ప‌ర్యాట‌కులు స‌ర‌స్సులోకి దిగి మంచుపై ఫోటోలు దిగుతున్నారు.

ఈ క్ర‌మంలో ఒక్క‌సారిగా మంచు విరిగిపోయింది. దీంతో ఇద్ద‌రు ప‌ర్యాట‌కులు నీటిలోకి ప‌డిపోయారు. ఈత రాక‌పోవ‌డం, లోతు ఎక్కువ‌గా ఉండ‌టంతో బ‌య‌ట‌కు రాలేక‌పోయారు. ప‌క్క‌నే ఉన్న‌వారు వారిని కాపాడేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ, లాభం లేక‌పోయింది. ఇద్ద‌రు నీటిలో గ‌ల్లంత‌య్యారు. అధికారులు ఓ మృతదేహాన్ని పైకి తీశారు. మరో మృతదేహం కోసం గాలింపు చేప‌ట్టారు. మృతి చెందిన ఇద్దరూ కేరళకు చెందిన పర్యాటకులుగా (Kerala Tourists) గుర్తించారు.

Read Also: మనిషి చావుబతుకుల్లో ఉంటే.. చేపల కోసం ఎగబడ్డరు!!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>