కలం, వెబ్ డెస్క్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) నివాసాలు, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అవినాష్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య అధికారులు, ప్రముఖుల నివాసాల్లోనూ ఒకేసారి ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు పది వేర్వేరు ప్రాంతాల్లో ఈడీ బృందాలు ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీలు, కీలక పత్రాలకు సంబంధించిన సమాచారం ఆధారంగా ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో అధికారుల తనిఖీలు కొనసాగుతుండగా, సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది.

