Mobile Popup Ad
Mobile Popup Ad

ఖమ్మం మిర్చి రైతులకు శుభవార్త

కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం(Khammam) జిల్లా మిర్చి రైతులకు జిల్లా యంత్రాంగం శుభవార్త చెప్పింది. పంటను మార్కెట్‌కు తీసుకొచ్చిన మిర్చి రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టడమే కాకుండా మార్కెట్ కమిటీ వారి ఫోన్ నెంబర్లు కూడా రైతులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టింది. జిల్లాలో ఖమ్మం, ఏనుకూరు రెండు వ్యవసాయ మార్కెట్లకు రైతులు మిర్చి పంటను తీసుకొస్తుంటారు. ఆ సమయంలో పంటను షెడ్లలో నిల్వ చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో అకాల వర్షాల నుంచి పంటను రక్షించుకోవచ్చు. అలాగే టర్పాలిన్లు కూడా అందుబాటులో ఉంచింది.

ఇవే కాక ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఏనుకూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో సూపర్వైజర్‌గా విధులు నిర్వహించే బీ.రామారావు 7330733408 తో పాటు ఖమ్మం మార్కెట్లో విధులు నిర్వహించే పి.ప్రవీణ్ కుమార్ 7330733375, పీ.వీరాంజనేయులు 733073338 పోన్ నెంబర్లను రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. వీరు 24 గంటలు రైతులకు అందుబాటులో ఉంటారని బుధవారం అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి (Srinivas Reddy)  తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>