కలం, మెదక్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర శాసనసభా హామీల అమలు కమిటీ ఛైర్మన్గా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి (Patlolla Sanjeeva Reddy) నేడు బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీ ప్రాంగణంలో పట్లోళ్ల సంజీవరెడ్డి ఈ బాధ్యతలు స్వీకరించగా.. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు,రాష్ట కాంగ్రెస్ నాయకులు,ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు సమర్థవంతంగా అమలయ్యేలా ప్రభుత్వం తరఫున బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు.

