Mobile Popup Ad
Mobile Popup Ad

డ్వాక్రా నిధుల్లో భారీ అవకతవకలు.. చేర్యాలలో మహిళల ధర్నా

కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట (Siddipet) జిల్లా చేర్యాల (Cherial) మండలం దానంపల్లి గ్రామంలో డ్వాక్రా మహిళా సంఘాల నిధుల్లో భారీ అవకతవకలు జరిగాయంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానంపల్లి గ్రామంలో సీఏ కమ్యూనిటీ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మమత సుమారు రూ.50 లక్షలకు పైగా పొదుపు సొమ్మును పక్కదారి పట్టించి, అవకతవకలకు పాల్పడిందని మహిళా సంఘాల సభ్యులు ఆరోపిస్తున్నారు.

​తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ డ్వాక్రా మహిళలు మంగళవారం చేర్యాల మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు. రహదారిపై మహిళలు పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Read Also: ఇరాన్‌కు కొత్త షాక్.. మ్యాచ్ తర్వాత వెంటనే అమెరికా వీడాలి!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>