కలం, నిర్మల్ : దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను (Durga Navratri Celebrations) పురస్కరించుకుని నిర్మల్ జిల్లాలోని గ్రామగ్రామాన దుర్గామాత అమ్మవారు ప్రత్యేక మండపాల్లో కొలువుదీరారు. అమ్మవారిని వివిధ రకాల పుష్పాలు, అలంకరణలతో ప్రతిష్ఠించారు. దీంతో గ్రామాల్లో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. సాయంత్రం భక్తులు పెద్ద సంఖ్యలో మండపాలకు చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జై భవాని.. జై జై భవాని నినాదాలతో గ్రామాలు మారుమోగాయి. కడ్తాల్ గ్రామంలోని రామాలయం వద్ద ప్రతిష్ఠించిన దుర్గామాత మండపం దగ్గర ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.
Also Read : జంతర్ మంతర్పై ఢిల్లీ పోలీస్ సంచలన నిర్ణయం!
Follow Us On: X(Twitter)

