కలం, వెబ్ డెస్క్ : జార్ఖండ్ రాష్ట్రంలోని దుమ్కా (Dumka) జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. ఒక కంటైనర్ ట్రక్కు ఇతర వాహనాలను బలంగా ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాద ధాటికి మంటలు వేగంగా వ్యాపించడంతో నాలుగు ట్రక్కులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. దురదృష్టవశాత్తు ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అగ్నిప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో దట్టమైన పొగ కమ్మేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: నగరంలో నకిలీ టీ పౌడర్ కలకలం!
Follow Us On : WhatsApp

