పోలీస్ ఉద్యోగార్థులకు ఫ్రీ కోచింగ్.. దుద్దిళ్ల శ్రీను బాబు కీలక పిలుపు!

కలం, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో శ్రీ విశ్వ అకాడమీ సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత మన ఊరు – మన కోచింగ్ సెంటర్ కార్యక్రమంలో భాగంగా పోలీస్ ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. ఆదివారం మంథని (Manthani Free Coaching ) పట్టణంలోని శివకిరణ్ గార్డెన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న దుద్దిళ్ల శ్రీను బాబు అభ్యర్థులకు ఎస్ఐ, కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు ఉపయోగపడే స్టడీ మెటీరియల్‌ను స్వయంగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగ యువతకు పోలీస్ ఉద్యోగాల సాధనలో మెరుగైన అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉచిత కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారని అన్నారు. అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందించడంతో పాటు, ప్రతిరోజూ మధ్యాహ్నం భోజన సదుపాయాన్ని కూడా కల్పించారని పేర్కొన్నారు అభ్యర్థులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ఉచిత కోచింగ్, భోజన సదుపాయాలు కల్పిస్తూ వారి పోలీస్ ఉద్యోగాల సాధనకు మంత్రి శ్రీధర్ బాబు గారు అండగా నిలుస్తున్నారని తెలిపారు.

దాదాపు 120 రోజులు పూర్తి కావస్తున్నందున ఈ శిక్షణ కార్యక్రమాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకొని, క్రమశిక్షణతో కష్టపడి చదివి పోలీస్ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. యువతకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేపడుతున్న ఇటువంటి కార్యక్రమాలు నిరుద్యోగ యువతకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తాయన్నారు. శిక్షణ పొందిన ప్రతి ఒక్కరూ మంచి ఫలితాలు సాధించి తమ కుటుంబాలకు, ప్రాంతానికి గర్వకారణంగా నిలవాలని దుద్దిళ్ల శ్రీను బాబు ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>