కలం, స్పోర్ట్స్: ఆసియా కప్ గెలిచిన భారత అండర్-19 జట్టుపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ప్రశంసలు కురిపించారు. యువ ఆటగాళ్ల పట్టుదల, నమ్మకాన్ని అభినందించారు. పట్టుదలకు బ్యాటింగ్ ఆర్డర్‌తో సంబంధం లేదంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఫైనల్లో పాకిస్థాన్ 337 పరుగులు చేయగా.. భారత్ 338 పరుగుల లక్ష్యాన్ని చివరి బంతికి ఛేదించింది. 252 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును మనాల్ చౌహాన్ 47, మొహిత్ ఉల్వా అజేయంగా 49 పరుగులతో ఆదుకున్నారు. చివరి బంతికి మొహిత్ ఫోర్ కొట్టడంతో భారత్ ఒక్క వికెట్ తేడాతో గెలిచింది. దీంతో తొమ్మిదోసారి ఆసియా కప్ టైటిల్ సాధించింది. మరోవైపు, వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ టోర్నీలో 361 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో ఒక సెంచరీ, మూడు అర్ధసెంచరీలు సాధించాడు.

