ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ విఫలం: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

కలం, మెదక్ బ్యూరో: రైతులు పంటలు సాగు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ యూరియా, ఎరువుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దుబ్బాక ఎమ్మెల్యే (Dubbaka MLA) కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ప్రతిరోజూ వందలాది మంది రైతులు రోడ్లు ఎక్కుతున్నారని, అవసరమైన సమయంలో ఎరువులు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. శుక్రవారం దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని మౌలిక వసతులపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. సాగునీటి సమస్యలు, కాల్వల మరమ్మతులు, వ్యవసాయానికి అవసరమైన మద్దతు కల్పించడంలో కూడా అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. చిన్న వర్షానికే రహదారులు దెబ్బతిని గ్రామాల రాకపోకలు నిలిచిపోతున్నాయని, గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని దుబ్బాక ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>