కలం, వెబ్ డెస్క్ : మద్యం మనిషిని కోతి చేష్టలు చేసేలా చేయగలదు.. సింహం అంత ధైర్యం నింపగలదు. మత్తులో ఉన్న వ్యక్తి చిత్రవిచిత్రమైన పనులు చేయడం చూసే ఉంటాం. తాజాగా ఫూటుగా తాగిన ఓ యువకుడు ఏకంగా 11kV పోల్ ఎక్కి తీగల మీద పడుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో జరిగింది. మత్తులో ఉన్న ఆ వ్యక్తి రెండు కరెంట్ వైర్ల మీద అరాంసే పడుకుని సేద తీరుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఏం తాగావు రా అయ్యా.. ఇంత ధైర్యం ఏంటి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, యువకుడు తీగల మీద పడుకున్నప్పుడు కరెంట్ లేకపోవడంతో బతికిపోయాడు. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు యువకుడిని నిలువరించి జాగ్రత్తగా కిందికి దింపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మద్యం మత్తులో మందుబాబు హల్చల్
-11KV హైటెన్షన్ లైన్‌పైకి ఎక్కి నిద్రపోయిన మందుబాబు!
-కరెంట్ కట్ చేసి కిందికి దింపిన విద్యుత్ అధికారులు
– ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌లో ఘటన
Drunk Man Climbs High-Tension Electric Pole to Nap in Uttar Pradesh’s Maharajganj#UttarPradesh… pic.twitter.com/KIAu8A2KLI— Kalam Daily (@kalamtelugu) June 24, 2026

