నిజామాబాద్ క‌లెక్ట‌రేట్‌లో క‌ల‌క‌లం!

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ కలెక్టరేట్‌ (Nizamabad Collectorate)లో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. తన ఇల్లును సొంతవారే కబ్జా చేయడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. నిజామాబాద్ హమాల్ వాడిలో ఉండే విజయ అనే మహిళకు ఒక చెల్లెలు ఉంది. ఇటీవలే త‌మ‌ తండ్రి మరణించాడు. అయితే ఆయన గతంలోనే అక్కాచెల్లెలికి ఇంట్లో చెరో గదిని రాసిచ్చారు. కానీ తండ్రి మరణించిన అనంతరం చెల్లెలు విజయను గెంటేసి ఇల్లు కబ్జా చేసుకుంది. దీంతో దిక్కతోచని విజయ త‌న మ‌న‌వ‌రాలితో క‌లిసి కలెక్టర్‌ను ఆశ్రయించింది. ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. కానీ, సమస్య పరిష్కారం అవుతుందో.. లేదోననే భయంతో విజయ మనమరాలు సరిత పురుగుల మందు తాగేందుకు యత్నించింది. గమనించిన పోలీసులు వెంటనే ఆమె దగ్గరి నుంచి పురుగుల మందు లాక్కున్నారు. విజయను, ఆమె మనమరాలు సరితను పోలీసులు విచారిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>