కలం, వెబ్ డెస్క్: హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా ఎలాంటి ఆటంకాలు లేకుండా రవాణాను ఇరాన్ తక్షణమే అనుమతించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటి నుంచి సరిగ్గా 48 గంటల్లోపు ఎటువంటి బెదిరింపులు లేకుండా ఇరాన్ (Iran) తన సముద్ర మార్గాన్ని పూర్తిగా తెరవాలని, లేదంటే అమెరికా దాడులు మొదలుపెడుతుందని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో స్పష్టం చేశారు. ఈ గడువులోగా ఇరాన్ స్పందించకపోతే ఆ దేశంలోని కీలక విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తామని ఆయన తేల్చి చెప్పారు.
ఇరాన్‌లోని అతిపెద్ద పవర్ ప్లాంట్‌ను ముందుగా టార్గెట్ చేస్తామని, ఆ తర్వాత మిగిలిన ప్లాంట్లను వరుసగా పేల్చివేస్తామని ట్రంప్ (Donald Trump) తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇరాన్ తన మొండి వైఖరిని వీడకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఆ దేశ పవర్ ప్లాంట్లను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని ఆయన హెచ్చరించారు. ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
Read Also: కేకేఆర్‌కు స్పిన్ గండం.. ఇర్ఫాన్ సంచలన వ్యాఖ్యలు!
Follow Us On: Facebook

