కలం, వెబ్ డెస్క్ : గాజాకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)గాజా శాంతి మండలి ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ గాజా శాంతి మండలిలో భారత్ చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానించారు. గాజాను అత్యుత్తమంగా పాలించేందుకు రెండు మండలిలను అమెరికా ఏర్పాటు చేసింది. అందులో కీలకమైన టెక్నికల్ మండలికి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉంటారు.
రెండో మండలి పరిపాలన సలహాదారుగా ఉంటుంది. ఈ రెండు మండళ్లలో ఇప్పటికే చాలా దేశాల ప్రతినిధులు ఎంపికయ్యారు. తమకు కూడా ఆహ్వానం అందినట్టు పాకిస్థాన్ ఇప్పటికే తెలిపింది. ఇప్పుడు భారత్ ను ఆహ్వానించాడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump0. ఓ వైపు ఇండియా మీద ఇప్పటికే భారీగా టారిఫ్ లు వేస్తున్నారు ట్రంప్. ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు ఆపకపోతే.. మన దేశం మీద 500 శాతం టారిఫ్ లు వేయడానికి చట్టం తెస్తున్నట్టు ట్రంప్ బెదిరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ట్రంప్ ఆహ్వానం మీద ఇండియా ఎలా స్పందిస్తుందో చూడాలి.


