epaper
Monday, January 19, 2026
spot_img
epaper

తిరుపతిని మరిపించేలా మేడారం అభివృద్ధి : పొంగులేటి

కలం, వరంగల్ బ్యూరో : చరిత్రలో మేడారం జాతర చిరస్థాయిగా నిలవబోతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti) తెలిపారు. ఇంకా 22 ఎకరాల భూ సేకరణ చేసి మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. జంపన్నవాగులో 365 రోజులు నిరంతరాయంగా ఫ్రెష్ వాటర్ ఉండేలా చెక్ డ్యాంలతో అభివృద్ధి చేస్తామన్నారు. భవిష్యత్తులో తిరుపతిని మరిపించేలా మేడారం అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 27వ క్యాబినెట్ మీటింగ్ గిరిజన దేవతల సన్నిదిలో జరిగిందని, చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా సీతక్క చొరవతో కేబినెట్ మీటింగ్ జరగడం గర్వంగా ఉందన్నారు. కేబినెట్‌ మీటింగ్‌ అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడారు.

జాతరలో అద్భుతమైన రాతి కట్టడాలతో చాలా వరకు పనులు పూర్తి చేసామని రేపు ఉదయం సీఎం ప్రారంభిస్తారన్నారు. కేబినెట్ లో బ్యాంక్ కార్పొరేట్ ఆఫీసర్లకు ల్యాండ్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపిందన్నారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు త్వరగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 2027 లో గోదావరి పుష్కరాలకు మంచి ప్లాన్ తో ఏర్పాటు చేయాలని ఆమోదించినట్లు చెప్పారు. బాసర నుండి భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూట్ చేసి ఎకో టూరిజంగా అభివృద్ధి చేస్తామన్నారు.

మార్చి 31 నాటికి ప్రణాళికాబద్ధంగా అన్ని ఆలయాలలో వసతులు కల్పిస్తామన్నారు. ఎలాగైతే మేడారంలో అభివృద్ధి పనులు చేసామో.. అదేవిధంగా అన్ని ఆలయాల్లో చేస్తామన్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్1 పనులపై కేబినెట్లో చర్చించడం జరిగిందన్నారు. ఫేజ్2A, ఫేజ్2బి కి ల్యాండ్ సేకరించేందుకు ఆమోదం తెలిపిందన్నారు. రూ. 2788 కోట్లతో సెకండ్ ఫేజ్ మెట్రో రైలుకు భూ సేకరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. హైదరాబాద్ ఐ త్రిబుల్ సీ నుండి శిల్పా లె అవుట్ వరకు 9కిలోమీటర్లు మేర హై లెవల్ బ్రిడ్జికి ఆమోదం తెలిపినట్లు మంత్రి పొంగులేటి (Ponguleti) వివరించారు.

అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఈరోజు మేడారంలో చారిత్రాత్మకమైన క్యాబినెట్ మీటింగ్ జరిగిందన్నారు. ఆర్ అండ్ బీ శాఖ ద్వారా త్వరగా హ్యామ్ రోడ్డు పనులు చేయాలని ఆమోదం తెలిపినట్లు చెప్పారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో అన్ని కోర్సులు దుబాటులో ఉండేలాగా క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మేడారం చరిత్ర 100 ఏళ్లు ఉండేలాగా నిర్మాణం చెయ్యడం సంతోషం గా ఉందన్నారు. మేడారం కు వస్తే తిరుపతి కి వచ్చినలాగా అనిపిస్తుందొన్నారు. రెండేళ్లలో తెలంగాణలో మట్టి రోడ్డు కనిపించదన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>